రాఘవేంద్రరావు(Ragavendra Rao) దర్శకత్వం వహించిన ‘పెళ్లి సందడి’(pelli sandadi) సినిమాతో టాలీవుడ్(tollywood) లోకి అడుగు పెట్టింది శ్రీలీల. వరుస హిట్లతో దూసుకుపోతూ టాలీవుడ్లో లక్కి గాళ్ అయిపోయింది.
sreeleela: రాఘవేంద్రరావు(Ragavendra Rao) దర్శకత్వం వహించిన ‘పెళ్లి సందడి’(pelli sandadi) సినిమాతో టాలీవుడ్(tollywood) లోకి అడుగు పెట్టింది శ్రీలీల. వరుస హిట్లతో దూసుకుపోతూ టాలీవుడ్లో లక్కి గాళ్ అయిపోయింది. దీంతో ప్రస్తుతం హీరోయిన్ శ్రీలీల జోరు ఏ రేంజ్ లో కొనసాగుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం చేతిలో అరడజన్ సినిమాల్లో డైరీలో డేట్లు ఖాళీగా లేకుండా బిజీగా ఉంది. ఓ పక్క కుర్ర హీరోలు మరో పక్క స్టార్ హీరోలతో నటిస్తోంది. ఏ హీరో ఫస్ట్ ఛాయిస్ అయినా ఇప్పుడు శ్రీలీలే. ఆ రేంజ్ లో డిమాండ్ తెచ్చుకున్న శ్రీలీల ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ , అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో బాలయ్య కి కూతురుగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
బాలయ్య తో షూటింగ్ అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చెయ్యాలి, చిన్న తేడా జరిగినా చెంప పగిలిపోతుంది. అది అభిమానుల విషయం లో అయినా సరే, తన తోటి నటీనటుల విషయంలో అయినా సరే , కరెక్ట్ గా లేకపోతే చెంప చెళ్లుమనిస్తాడు బాలయ్య, శ్రీలీల విషయం లో కూడా అదే జరిగింది. చాలా సార్లు వైరల్ అయిన వీడియో చూసే ఉన్నాం. శ్రీలీల కూడా బాలయ్య చెంపదెబ్బ బారిన పడిందంట. ఎవ్వరూ చెయ్యకూడని తప్పు చేసి, అడ్డంగా దొరికిపోయిందనుకుంటున్నారా.. పప్పులో కాలేసినట్టే.. ఇది నిజం కాదు, కేవలం నటన మాత్రమే. సినిమాల్లో చెంపదెబ్బ అంటే చెయ్యి చెంప వరకు క్లోజ్ గా తీసుకొచ్చి ఆపేస్తారు. కానీ ఇక్కడ శ్రీలీల మాత్రం తనకి నిజమైన ఎమోషన్ రావడం కోసం బాలయ్య ని నిజంగానే కొట్టమని రిక్వెస్ట్ చేసిందట. బాలయ్య కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి చెంప చెళ్లుమనిపించడం తో షూటింగ్ స్పాట్ మొత్తం ఒక్కసారిగా పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోయిందట. ఈ షాట్ అద్భుతంగా రావడం తో డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా కట్ చెప్పకుండా అలా చూస్తూ ఉండిపోయాడట.