Covid 19: డ్రాగన్ కంట్రీ చైనాలో మళ్లీ కరోనా హడలెత్తిస్తోంది. కొత్త వేరియంట్ ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. జూన్ నెలలో చైనాలో కరోనా వైరస్ మరోసారి విజృంభించనుందని అమెరికా తెలిపింది. వైరస్ ఎదుర్కోవడానికి అభివృద్ధి చెందిన రోగనిరోధక శక్తిని దాటి ప్రజలకు హాని చేసేందుకుగా వస్తోన్నవైరస్ ప్రయత్నిస్తుందని తెలిపారు. జూన్లో కరోనా కేసులు గరిష్ట స్థాయికి చేరుకోవచ్చని అంచనా వేసింది. వారానికి 65 మిలియన్ల మందికి సోకుతుందని చెబుతోంది. కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఎదుర్కోవడానికి చైనా అధికారులు వ్యాక్సిన్లను తయారు చేయనున్నారు.
XBB ఓమిక్రాన్ సబ్వేరియంట్లకు (XBB. 1.9.1, XBB. 1.5, మరియు XBB. 1.16తో సహా) రెండు కొత్త వ్యాక్సినేషన్లు రిలీజ్ చేయనున్నట్లు ప్రముఖ చైనీస్ ఎపిడెమియాలజిస్ట్ ఝాంగ్ నాన్షాన్ తెలిపారు గ్వాంగ్జౌలోని బయోటెక్ సింపోజియంలో ఆయన మాట్లాడారు. మూడు నుంచి నాలుగు ఇతర వ్యాక్సిన్లకు త్వరలో ఆమోదం లభిస్తుందని జాంగ్ చెప్పారు. చైనా అధికారులు ప్రస్తుత వేవ్ తక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రజారోగ్య నిపుణులు దేశంలో భారీ వృద్ధ జనాభాలో మరణాల పెరుగుదలను నివారించడానికి, తీవ్రమైన టీకా బూస్టర్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. దీంతోపాటు ఆసుపత్రులలో యాంటీవైరల్ల సిద్ధంగా సరఫరా అవసరమని భావిస్తున్నారు.
“ఇన్ఫెక్షన్ల సంఖ్య తక్కువగా ఉంటుంది. తీవ్రమైన కేసులు ఖచ్చితంగా తక్కువగా ఉంటాయి. మరణాల ప్రభావం ఉండదు. ఇది తేలికపాటి వ్యాప్తి అని మేము భావించామని, ఇప్పటికీ సమాజంపై గణనీయమైన ఆరోగ్య ప్రభావాన్ని చూపుతుంది.” రీఇన్ఫెక్షన్ స్వల్ప లక్షణాలను కలిగి ఉంటాయి. విధిగా మాస్క్ ధరించాలని కోరారు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నా.. రద్దీగా ఉన్న ప్రాంతాలకు వైపు వెళ్లొద్దని సూచించారు. నాన్జింగ్లో గల ఓ వర్సిటీలో విద్యార్థులు ఇబ్బంది పడ్డారు.