Tipu Sultan: టిప్పు సుల్తాన్ ఖడ్గాన్ని (Tipu Sultan) మరోసారి వేలం వేశారు. ఇదివరకు వేలంలో లిక్కర్ బ్యారన్ విజయ్ మాల్యా (vijay malya) దక్కించుకున్నారు. కలిసి రాలేదని అమ్మేసిన సంగతి తెలిసిందే. దీంతో తాజాగా మరోసారి వేలం జరగగా.. ఈ సారి కూడా కళ్లు చెదిరే ధర పలికింది.
లండన్లో (london) బొన్హామ్స్ యాక్షన్ హౌస్ వేలం వేయగా.. ఓ వ్యక్తి రూ.144 కోట్లకు దక్కించుకున్నాడు. సదరు వ్యక్తి పేరును మాత్రం నిర్వాహకులు తెలియజేయలేదు. ఖడ్గం దక్కించుకునేందుకు ముగ్గురు (3 people) పోటీ పడ్డారట. అత్యధిక మొత్తంలో బిడ్డింగ్ వేసిన వ్యక్తి దక్కించుకున్నాడు.అంచనా వేసిన ధర కన్నా ఏడు రెట్లు (seven times high) ఎక్కువ ధర వచ్చిందని బొన్షామ్స్ కంపెనీ మర్షం వ్యక్తం చేసింది. 18వ శతాబ్దం నాటి ఖడ్గం అంటే కొందరు ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఈ సారి కూడా ముగ్గురు వరకు పోటీ పడ్డ.. చివరికీ ఒకరు దక్కించుకున్నారు.