ప్రపంచంలో ఖరీదైన విస్కీని సోథెబి సంస్థ వేలం వేయనుంది. నవంబర్ 1వ తేదీ నుంచి బిడ్డింగ్ వేయాలని.. 18వ తేదీన వేలం ఉంటుందని కంపెనీ చెబుతోంది. ఆ బాటిల్‌కు భారత కరెన్సీలో రూ.12 కోట్లు పలికే అవకాశం ఉందని తెలుస్తోంది.
World's "Most Valuable" Whiskies Set For Auction, Could Fetch Up To 12 Crore Rupees
Valuable Whisky: విస్కీ (Valuable Whisky) ఎంత మగ్గితే అంత టేస్ట్ ఉంటుంది. అంటే ఎక్కువకాలం క్రితానికి, అలాగే బ్రాండెడ్.. సింగిల్ మాల్ట్ అయితే ఆ టేస్ట్ వేరే.. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 96 ఏళ్ల క్రితం నాటి విస్కీ టేస్ట్ ఎలా ఉంటుంది.. స్మూత్‌గా ఉండటమే కాదు.. ధర కూడా ఎక్కువ ఉండనుంది.
ప్రపంచంలో ఖరీదైన స్కాచ్ విస్కీ వేలం జరగనుంది. మెకాల్లన్ కంపెనీ సింగిల్ మాల్ట్ విస్కీని వేలానికి తీసుకురానుంది సోథెబి సంస్థ. 1926 ఏడాదికి చెందిన అంటే.. 96 ఏళ్ల క్రితానికి చెందిన విస్కీ వేలం వేయనుంది. నవంబర్ 1వ తేదీ నుంచి బిడ్డింగ్ వేసుకునే అవకాశం కల్పించింది. ఆ నెల 18వ తేదీన వేలం నిర్వహిస్తారు. ఆ విస్కీ 1.2 మిలియన్ పౌండ్ల ధర పలకనుందని సమాచారం. అంటే భారత కరెన్సీలో అక్షరాలా రూ.12 కోట్లు ఉండనుంది.
ఇలాంటి విస్కీని ఒకరు సేల్ చేయాలని.. మరొకరు సొంతం చేసుకోవాలని అనుకుంటారని సోథెబి స్పిరిట్స్ హెడ్ జానీ ఫౌలే తెలిపారు. సౌథెబి సంస్థ ఇలాంటి రేర్ విస్కీలను వేలం వేస్తుంది. 2019లో కూడా 1926కి చెందిన విస్కీ వేలం వేయగా 1.5 మిలియన్ డాలర్లు అంటే.. మన కరెన్సీలో రూ.15 కోట్లు పలికింది.
మెకల్లాన్ విస్కీని 60 ఏళ్లపాటు పీపాలో మగ్గించింది. 1986లో 1926 ఏడాదికి చెందిన విస్కీని బాటిళ్లలో పోసింది. వీటిలో ఒక్కటే వాడారట. అంటే ఇప్పుడు వేలం జరిగేది మరొకటి.. అంటే ఇంకా 38 బాటిళ్లు ఉండి ఉంటాయి. ఆ బాటిళ్లు కూడా భారీ ధర పలకనుంది. ఆ బాటిల్స్ ఎవరి వద్ద ఉన్నాయో..? ఏ సంస్థ వేలం వేయనుందో తెలియాల్సి ఉంది.