»5g Spectrum Auction Concludes With Rs 11300 Crore In Telecom Bids
Spectrum : రెండు రోజుల్లోనే ముగిసిన స్పెక్ట్రమ్ వేలం, టాప్ బిడ్డర్ ఎయిర్టెల్
టెలికాం స్పెక్ట్రమ్‌ని ప్రభుత్వం వేలానికి పెట్టింది. మొత్తం రూ.96,238 కోట్ల విలువైన స్పెక్ట్రమ్‌ని వేలానికి పెట్టగా దాదాపుగా రూ.11,340 స్పెక్ట్రమ్ మాత్రమే అమ్ముడుపోయింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి చదివేయండి.
Spectrum Auction : ఈ ఏడాది స్పెక్ట్రమ్ కేవలం రెండు రోజుల్లోనే ముగిసింది. మంగళవారం ప్రారంభమైన స్పెక్ట్రమ్ వేలం బుధవారానికే ముగిసిపోయింది. టెలికాం కంపెనీలకు స్పెక్ట్రమ్ అమ్మడానికి ప్రభుత్వం ఈ ఏడాది రూ.96,238 కోట్ల విలువైన 10 గిగాహెర్డ్జ్ 5జీ స్పెక్ట్రమ్‌ని వేలానికి(SPECTRUM AUCTION) పెట్టింది. అయితే ఈసారి ఆదరణ అంతంత మాత్రంగానే ఉంది. ప్రభుత్వం వేలానికి ఉంచిన దానిలో కనీసం సగం కూడా అమ్ముడుపోలేదు. కేవలం రూ.11,340 కోట్ల విలువైన స్పెక్ట్రమ్‌ని మాత్రమే టెలికాం సంస్థలు వేలంలో కొనుగోలు చేశాయి.
అత్యధిక స్పెక్ట్రమ్‌ని కొనుక్కున్న కంపెనీగా భారతీ ఎయిర్టెల్(AIRTEL) నిలిచింది. రూ.6856.76 కోట్ల విలువైన స్పెక్ట్రరమ్ని కొనుగోలు చేసింది. ఆ తర్వాత రూ.973.2 కోట్ల స్పెక్ట్రరమ్ని కొనుక్కుని జియో(JIO) రెండో స్థానంలో ఉంది. ఒడాఫోన్ ఐడియా రూ.3510.4కోట్ల విలువైన స్పెక్ట్రమ్‌ని కొనుక్కుంది. ఎయిర్టెల్, ఒడాఫోన్ ఐడియా ఇప్పటికే తమ దగ్గర ఉన్న 900-1800 మెగాహెర్ట్జ్ బ్యాండ్ స్పెక్ట్రమ్‌ని తిరిగి కొనుక్కున్నాయి.
ఈసారి టెలికాం కంపెనీల నుంచి వేలానికి ఆదరణ అంతంత మాత్రంగానే ఉంది. కేవలం రెండు రోజుల్లోనే వేలం పూర్తి అయిపోవడం గమనార్హం. మొత్తం ఏడు రౌండ్లలో వచ్చిన బిడ్ల విలువ 12 శాతంగా మాత్రమే ఉంది. రూ.11,340 కోట్ల బిడ్లు మాత్రమే దాఖలు అయ్యాయి. దీంతో అధికారులు ఇక చేసేది ఏమీ లేక వేలం ముగిస్తున్నట్లు ప్రకటించారు. అయితే విశ్లేషకులు మాత్రం అంచనాలకు అనుగుణంగానే బిడ్డింగ్ జరిగిందని చెబుతున్నారు.