»Fresh Case Against Prajwal Revanna Preetham Gowda Implicated For Video Leak For The First Time
Revanna : మహిళను నగ్నంగా మారాలంటూ వేధింపులు, ప్రజ్వల్ రేవణ్ణపై మరో కేసు
హసన మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై తాజాగా మరో కేసు నమోదు అయ్యింది. మహిళను వీడియోకాల్‌లో నగ్నంగా మారాల్సిందిగా వేధింపులు గురి చేసినట్లు ఆ మహిళ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Fresh case against Prajwal Revanna : హసన మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై లైంగిక వేధింపుల కేసుల పరంపర కొనసాగుతోంద. ఇప్పటికే మూడు కేసులో నిందితుడిగా ఉన్న ఆయనపై తాజాగా మరో మహిళ ఫిర్యాదు చేసింది. తన కూతురికి పాఠశాలలో సీటు ఇప్పించాల్సిందిగా ఓ మహిళ ప్రజ్వల్ని సాయం అడిగింది. అప్పటి నుంచి ఆయన తన ఫోన్ నెంబర్ తీసుకుని వీడియో కాల్ చేసేవాడని చెప్పింది.
వీడియో కాల్ చేసిన సమయంలో ఆమెను నగ్నంగా మారాల్సిందిగా ఒత్తిడి తెచ్చేవాడు. అలా మారిన తర్వాత మాత్రమే ఆయన సంతృప్తి చెందేవాడని ఆ ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు బుధవారం ఆమె సీఐడీ సైబర్ క్రైం ఠాణాలో ఫిర్యాదు చేసింది. ఆ ఫుటేజీలను తన ఫోన్లో భద్రపరుచుకుని బెదిరించేవాడని తెలిపింది. సోషల్ మీడియాలో ఈ వీడియోలను(video leak ) పోస్ట్ చేస్తానని భయపెట్టేవాడని పేర్కొంది.
అలా తన వీడియోలు పెన్‌డ్రైవ్‌లో సైతం సేవ్ చేశాడని సదరు మహిళ ఆందోళన వ్యక్తం చేసింది. ఆ వీడియోలను కిరణ్, శరత్, మాజీ ఎమ్మెల్యే ప్రీతం గౌడలు(Preetham Gowda ) బయటకు వెళ్లడించారని, వారిపైనా చర్యలు తీసుకోవాలని ఆమె కోరింది. అత్యాచారం, లైంగిక వేధింపుల కేసుల్లో ఇప్పటికే విచారణను ఎదుర్కొంటున్న రేవణ్ణ ఈ కేసుతో మరింత చిక్కుల్లో పడ్డారు. ఈ కేసు దర్యాప్తును మరో ప్రత్యేక బృందానికి అప్పగించారు.