»Hassan Mp Prajwal Revanna Who Was Arrested In The Sexual Assault Case Is Not Cooperating With The Special Investigation Team
Prajwal Revanna : కుట్ర చేసి నన్ను ఈ కేసులో ఇరికించారు : ప్రజ్వల్ రేవణ్ణ
లైంగిక దాడి కేసులో అరెస్టైన హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఇన్వెస్టిగేషన్ బృందానికి ఏమాత్రం సహకరించడం లేదని వార్తలు వెలువడుతున్నాయి. తనకేం తెలియదని కావాలనే తనను ఈ కేసులో ఇరికించారని ఎంపీ చెబుతూ వస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Mp Prajwal Revanna :లైంగిక దాడి కేసులో అరెస్టైన హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను(Hassan Mp Prajwal Revanna) సిట్ అధికారులు రెండు రోజులుగా విచారిస్తున్నారు. అయితే ఈ విచారణకు ప్రజ్వల్ రేవణ్ణ ఏ మాత్రమూ సహకరించడం లేదని తెలుస్తోంది. దేనికీ సరైన సమాధానం చెప్పకుండా ఆయన సహాయ నిరాకరణ చేస్తున్నట్లు సమాచారం. దర్యాప్తులో భాగంగా సిట్ అడిగిన ప్రశ్నలకు ఆయన తనకేం తెలియదని, తాను నిర్దోషినని సమాధానం ఇస్తున్నారట. కావాలనే తనను ఈ కేసులో ఇరికించారని చెబుతున్నారట.
ఈ నేపథ్యంలో ప్రజ్వల్ రేవణ్ణతో(Prajwal Revanna) స్పాట్ విచారణ జరిపాలని దర్యాప్తు బృందం అధికారులు భావిస్తున్నారు. ఏమైనా అసభ్యకర వీడియోలను ఆయన ఫోన్ నుంచి తీశారా? అన్న కోణంలోని పరిశీలిస్తున్నారు. ఆయన వాడిన యాపిల్ ఫోన్ డాటాను యాక్సస్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఐ క్లౌడ్‌లో ఉన్న డాటాను పరిశీలించడం ద్వారా ఆయన అలాంటి వీడియోలను ఏమైనా ఆ ఫోన్ నుంచి తీసారా? అని తెలుసుకునేందుకు చూస్తున్నారు. ఎన్నికల ఫలితాలలోపే ఈ దర్యాప్తును పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు.
ప్రజ్వల్ రేవణ్ణ(Prajwal Revanna) తల్లి ఇదే కేసులో విచారణకు గైర్హాజరయ్యారు. ఆమె సోమవారం బెయిల్ కోసం కోర్టును ఆశ్రయిస్తారని తెలుస్తోంది. రేవణ్ణ తండ్రి ఇప్పటికే కిడ్నాప్ కేసులో అరెస్టయ్యారు. బెయిల్‌పై బయటకూ వచ్చారు. అయితే సిట్ అధికారులు ఆయన బెయిల్‌ని రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయించింది. దీనిపైనా నేడు స్పష్టత వచ్చే అవకాశం ఉంది.