»Prajwal Revanna Sex Tape Case Troubles Increased Revoke Diplomatic Passport Action Started Says Mea
Prajwal Revanna : దేశానికి తిరిగి రాకముందే పెరగనున్న ప్రజ్వల్ రేవణ్ణ కష్టాలు
కర్ణాటకలోని హాసన్ నుంచి సస్పెండ్ అయిన జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చర్యలు ప్రారంభించింది. రేవణ్ణ దౌత్య పాస్‌పోర్టు రద్దుకు పూనుకుంది.
Prajwal Revanna : కర్ణాటకలోని హాసన్ నుంచి సస్పెండ్ అయిన జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చర్యలు ప్రారంభించింది. రేవణ్ణ దౌత్య పాస్‌పోర్టు రద్దుకు పూనుకుంది. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ గురువారం వెల్లడించారు. పాస్‌పోర్ట్ చట్టంలోని నిబంధనల ప్రకారం ఈ చర్య తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ప్రజ్వల్ రేవణ్ణ కర్ణాటకకు చెందిన పలువురు మహిళలను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. రేవణ్ణకు సంబంధించిన పలు సెక్స్ టేపులు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో కర్ణాటక రాజకీయాల్లో కలకలం రేపుతోంది.
ప్రజ్వల్ రేవణ్ణ ఈరోజు అర్ధరాత్రి బెంగళూరుకు తిరిగి వచ్చి మే 31న ఉదయం 10 గంటలకు సిట్ ఎదుట హాజరుకానున్నారు. అయితే అరెస్ట్ అవసరమైతే విమానాశ్రయం నుండే అరెస్ట్ చేస్తామని కర్ణాటక హోంమంత్రి స్పష్టంగా చెప్పారు. దౌత్యపరమైన పాస్‌పోర్ట్‌ను ఎందుకు రద్దు చేయకూడదో వివరిస్తూ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇప్పటికే రేవణ్ణకు నోటీసు జారీ చేసింది. సమాధానం ఇవ్వడానికి 10 రోజుల గడువు ఇచ్చింది. ప్రజ్వల్ రేవణ్ణ అనేక లైంగిక వేధింపుల కేసుల్లో పేరు రాకముందే దౌత్యపరమైన పాస్‌పోర్ట్‌పై నెల రోజుల క్రితం భారతదేశం విడిచిపెట్టాడు. ఈ ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. అయితే ఈ కాలంలో ప్రజ్వల్ దేశానికి తిరిగి రాకుండా బయటే ఉన్నాడు.
ప్రజ్వల్ లుఫ్తాన్సా మ్యూనిచ్-బెంగళూరు విమానంలో ‘బిజినెస్ క్లాస్’ టిక్కెట్‌ను బుక్ చేసుకున్నాడు. మే 31వ తేదీ అర్ధరాత్రి 12:30 గంటలకు ప్రజ్వల్ కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అనేక మంది మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సస్పెండ్ అయిన జనతాదళ్ (సెక్యులర్) నాయకుడు ప్రజ్వల్ రేవణ్ణకు వ్యతిరేకంగా వందలాది మంది ప్రజలు గురువారం ధర్నా చేశారు. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నిరసనకారులు ‘హసన్ చలో’ మార్చ్‌లో పాల్గొన్నారు. నిందితులను అరెస్టు చేయాలని.. కేసుపై నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక మానవ హక్కుల సంఘం ఆధ్వర్యంలో మార్చ్ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలు, కార్మికులు, రైతులు, దళితులు ఇందులో పాల్గొన్నారు. ప్రజ్వల్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేయడంతో పాటు బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ పాదయాత్రలో పాల్గొన్న ప్రజలు వారికి సంఘీభావం తెలిపారు. ఇక్కడి మహారాజా పార్కు సమీపంలోని హేమావతి విగ్రహం నుంచి ప్రారంభమైన పాదయాత్ర హాసన్ డిప్యూటీ కమిషనర్ సి సత్యభామకు వినతి పత్రం సమర్పించారు.