ప్రస్తుతం టెలికాం సంస్థలు మొబైల్ రీఛార్జ్ ధరలను పెంచుతూ పోతున్నాయి. కానీ ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ మాత్రం రీఛార్జ్ ధరలను తగ్గిస్తోంది. బీఎస్ఎన్ఎల్ మాత్రం సామాన్యుడిని దృష్టిలో పెట్టుకుని రీఛార్జ్ ప్లాన్ పెడుతుంది. మరి ఆ ప్లాన్ ఏంటో తెలుసుకుందాం.
BSNL: ప్రస్తుతం టెలికాం సంస్థలు మొబైల్ రీఛార్జ్ ధరలను పెంచుతూ పోతున్నాయి. కానీ ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ మాత్రం రీఛార్జ్ ధరలను తగ్గిస్తోంది. బీఎస్ఎన్ఎల్ మాత్రం సామాన్యుడిని దృష్టిలో పెట్టుకుని రీఛార్జ్ ప్లాన్లు పెడుతుంది. దీనిలో భాగంగా 35 రోజుల కాలపరిమితితో రూ.107 కనీస రీఛార్జ్ ప్లాన్ ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ కింద 200 నిమిషాలు మాట్లాడుకోవచ్చు. అలాగే 3 జీబీ డేటాను కూడా వినియోగించుకోవచ్చు. జియో, ఎయిర్టెల, వొడాఫోన్ ఐడియా అందిస్తున్న ప్లాన్ల కంటే ఇది చౌకది. ఈ మధ్య కాలంలో జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఇడియాలు తమ ప్లాన్ల ధరలను 25 శాతం వరకు పెంచాయి. దీంతో చాలామంది కస్టమర్లు బీఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం కొన్ని నగరాల్లో మాత్రమే 4జీ సేవలు అందిస్తోంది. వచ్చే నెల చివరినాటికి ఈ సేవలను దేశవ్యాప్తంగా విస్తరించాలనుకుంటుంది.