»Jio Is Ready To Enter Upi Payments Segment Paytm And Phonepe Will Face Challenge
Jio UPI : త్వరలో ఫోన్ పే, పేటీఎంలకు పోటీగా జియో యూపీఐ
భారత టెలికాం రంగంలో అతిపెద్ద సంస్థ అయిన జియో ఇప్పుడు UPI చెల్లింపు సేవల్లోకి ప్రవేశించబోతోంది. జియో ప్రవేశంతో Paytm, PhonePe వంటి పెద్ద సంస్థలు గట్టి పోటీని ఎదుర్కోబోతున్నాయి.
Jio UPI : భారత టెలికాం రంగంలో అతిపెద్ద సంస్థ అయిన జియో ఇప్పుడు UPI చెల్లింపు సేవల్లోకి ప్రవేశించబోతోంది. జియో ప్రవేశంతో Paytm, PhonePe వంటి పెద్ద సంస్థలు గట్టి పోటీని ఎదుర్కోబోతున్నాయి. టెలికాం రంగంలోకి ప్రవేశించిన జియో ఉచిత సేవలను అందించడం ద్వారా పెద్ద సంచలనం సృష్టించింది. ఇప్పుడు Jio రిటైల్ అవుట్లెట్లలో సౌండ్‌బాక్స్‌ను అందించడం ప్రారంభించింది. ఇది Paytm సౌండ్‌బాక్స్‌కి ప్రత్యక్షంగా సవాల్ విసిరినట్లైంది. ముఖేష్ అంబానీ జియో పే యాప్ సేవకు సౌండ్‌బాక్స్ చేరికతో UPI చెల్లింపు విభాగంలో కంపెనీ ప్రమేయం పెరుగుతుంది. io సౌండ్‌బాక్స్ ట్రయల్‌ను ఇప్పటికే ప్రారంభించింది. Paytm, PhonePe , Google Pay ఇప్పటికే ఈ విభాగంలో భారీగా మార్కెట్ ను కలిగి ఉన్నాయి. Paytm పేమెంట్ బ్యాంక్‌పై RBI చర్య కారణంగా ఆ సంస్థ పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంది. డిజిటల్ చెల్లింపు విభాగంలో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి Jio వేగవంతమైన చర్యలను ప్రారంభించింది. దుకాణదారులకు కంపెనీ మంచి ప్రోత్సాహకాలు కూడా ఇస్తోంది.
ఇటీవలే ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ కూడా తన UPI సేవ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్)ను ప్రారంభించినట్లు ప్రకటించింది. యాక్సిస్ బ్యాంక్ సహకారంతో కంపెనీ తన UPI హ్యాండిల్ (@fkaxis)ని ప్రారంభించింది. డిజిటల్ చెల్లింపు సేవలోకి ప్రవేశించడం ద్వారా కంపెనీ తన వినియోగదారులకు మరిన్ని సౌకర్యాలను అందించాలనుకుంటోంది. ప్రస్తుతం, Flipkart UPI ఆండ్రాయిడ్ కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. దీని సహాయంతో వినియోగదారులు ఫ్లిప్‌కార్ట్ యాప్ నుండి నేరుగా చెల్లింపు కూడా చేయవచ్చు.