»Cm Jagan Slams Chandrababu And Pawan Kalyan In Medarametla Siddham Meeting
CM Jagan : ప్రజలు శ్రీకృష్ణుడు అయితే నేను అర్జునుడ్ని.. మేదరమెట్ల సభలో సీఎం జగన్
సిద్ధం అంటే ప్రజలు చేసే యుద్ధం అని, సిద్ధం అంటే ప్రజా సముద్రం అని బాపట్ల జిల్లా మేదరమెట్ల సిద్ధం సభలో సీఎం జగన్ అన్నారు. మరో ఐదేళ్లు నన్ను ఆశీర్వదించేందుకు వచ్చిన ఈ ప్రజా సైన్యానికి సెల్యూట్ చేస్తున్నానన్నారు.
CM Jagan : సిద్ధం అంటే ప్రజలు చేసే యుద్ధం అని, సిద్ధం అంటే ప్రజా సముద్రం అని బాపట్ల జిల్లా మేదరమెట్ల సిద్ధం సభలో సీఎం జగన్ అన్నారు. మరో ఐదేళ్లు నన్ను ఆశీర్వదించేందుకు వచ్చిన ఈ ప్రజా సైన్యానికి సెల్యూట్ చేస్తున్నానన్నారు. ఇప్పటికే ఉత్తరాంధ్ర, ఉత్తర కోస్తా, రాయలసీమ సిద్ధం అయ్యాయని, ఇప్పుడు దక్షిణ కోస్తా కూడా సిద్ధం అయిందన్నారు. ఈసారి ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధం వంటివని, ప్రజలే శ్రీకృష్ణుడు అయితే, తాను అర్జునుడ్ని అని జగన్ అన్నారు. చంద్రబాబు మాదిరిగా నాకు నటించే పొలిటికల్ స్టార్ క్యాంపెయినర్లు ఎవరూ లేరు. నాకు చంద్రబాబులా ఈనాడు లేదు, ఆంధ్రజ్యోతి లేదు, టీవీ5 లేదు. అబద్ధాలకు రంగులు వేసే ఎల్లో మీడియా లేదు. మీ బిడ్డకు రకరకాల పొత్తులు లేవు. ఎన్నికలకు మీ బిడ్డ ఒంటరిగానే వెళుతున్నాడు. నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో నాకు అంతమంది పేదింటి స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు. ప్రతి ఇంట్లోనూ నాకు స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు. ఇవాళ నా ఎదుట ఇసుక వేస్తే రాలనంతగా ఉన్న మీరందరూ కూడా నాకు స్టార్ క్యాంపెయినర్లే అన్నారు.
మీ బిడ్డ ఇంటింటికీ చేసిన అభివృద్ధిని చూసి చంద్రబాబు భయపడుతున్నాడు. మనను నేరుగా ఎదుర్కొనలేక ఢిల్లీ వెళ్లి పొత్తులు పెట్టుకున్నారు. మన ఎమ్మెల్యేలు గడపగడపకు తిరుగుతుంటే, చంద్రబాబు మాత్రం ఢిల్లీలో ఇతర పార్టీల గడపలకు తిరుగుతున్నారంటూ జగన్ ఆరోపించారు. మేనిఫెస్టో అంటే చెత్తబుట్టలో వేసే డాక్యుమెంట్ కాదు. వైసీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతం పూర్తి చేశామన్న నిజాయతీ నుంచి మన ఫ్యానుకు కరెంటు వస్తుంది. మేనిఫెస్టో నాకు ఒక పవిత్ర గ్రంథం. మేనిఫెస్టో అంటే ఒక ఖురాన్, ఒక భగవద్గీత, ఒక బైబిల్ తో సమానం అన్నారు. చంద్రబాబు పరిస్థితి ఏమిటి అని గమనిస్తే చంద్రబాబు ఈ ఎన్నికలకు తుప్పు పట్టిన సైకిల్ తో వస్తున్నాడు. చంద్రబాబు సైకిల్ కు ట్యూబులు లేవు, చక్రాలు లేవు. ఆ తుప్పు పట్టిన సైకిల్ ను నెట్టడానికి చంద్రబాబుకు వేరే పార్టీల సాయం కావాల్సి వచ్చింది. పొత్తుల్లో భాగంగా ముందు ఒక ప్యాకేజి ఇచ్చి దత్తపుత్రుడ్ని తెచ్చుకున్నాడు. ఈ దత్తపుత్రుడు చంద్రబాబు సిట్ అంటే కూర్చుంటాడు. చంద్రబాబు స్టాండ్ అంటే నిలబడతాడు. ఎప్పుడు సైకిల్ దిగమంటే అప్పుడు దిగుతాడు. ఈ సున్నా ఎన్నిపార్టీలతో కలిసినా దాని విలువ బోడి సున్నా అని విమర్శించారు.