శబరిమలలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తెలుగు భక్తుడిపై స్థానిక వ్యాపారులు దాడి చేయడంతో అతడి తల పగిలింది. వాటర్ బాటిల్ ధర ఎక్కువగా ఉందని ప్రశ్నించినందుకు వ్యాపారులంతా కలిసి దాడి చేసినట్లు తెలుస్తోంది. దీంతో పెద్ద ఎత్తున తెలుగు భక్తులు షాపు వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. కాగా, ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.