E.G: ఇటీవల మృతి చెందిన టీడీపీ సీనియర్ మైనార్టీ నేత మహమ్మద్ అలీ కుటుంబాన్ని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పరామర్శించారు. గురువారం దుద్దుకూరులో పర్యటించిన ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. తక్షణ సాయంగా రూ. 50 వేలు అందజేశారు. పార్టీ తరఫున బాధిత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో మండల, గ్రామ నాయకులు పాల్గొన్నారు.