WGL: నేడు నర్సంపేటకు సీఎం రేవంత్ రానున్న విషయం తెలిసిందే. నియోజకవర్గంలో రూ.531 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు మెడికల్ కళాశాల సమీపంలో శంకుస్థాపన చేస్తారు.మధ్యాహ్నం 1:15 గం.కు బేగంపేట నుంచి హెలీకాప్టర్లో బయల్దేరి, 2 గంటలకు నర్సంపేట హెలీప్యాడ్ చేరుకుంటారు. మ.2:15 నుంచి 3:55 వరకు కార్యక్రమాల్లో పాల్గొని, 4 గంటలకు తిరుగు ప్రయాణం అవుతారు.