HYD: బ్రహ్మకుమారీస్ సంస్థ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలోని శాంతిసరోవర్ క్యాంపస్లో ఆదివారం ‘సండే ఈవినింగ్ టాక్’ కార్యక్రమం నిర్వహించనున్నారు. సాయంత్రం 6:30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ‘విలువ వినోదం’ (వాల్యూటెయిన్మెంట్) పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా విలువల కార్యకలాపాలు, దైవిక గీతాలాపన వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.