GDWL: మానవపాడు మండలం రైల్వే స్టేషన్ సమీపంలోని ఆర్డీఎస్ కాలవలపై గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. మరణించిన వృద్ధురాలి వయస్సు 70 ఏళ్లు ఉంటుందని, ఆమె పసుపుపచ్చ జాకెట్ ధరించి ఉందని ఎస్సై చంద్రకాంత్ తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని గుర్తించిన వారు 8712670288 నంబర్‌కు, మానవపాడు పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని తెలిపారు.