MBNR: దేవరకద్ర నియోజకవర్గంలోని చిన్న రాజమూర్ గ్రామంలో శ్రీ ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం తెల్లవారుజామున నిర్వహించిన రథోత్సవంలో దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులతో కలిసి ఆంజనేయ స్వామి రథాన్నిలాగారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు.