KDP: ప్రొద్దుటూరు మండలంలో అక్రమాలకు పాల్పడిన 33మంది రేషన్ దుకాణాల డీలర్లకు నోటీసులు జారీ చేశామని MRO గంగయ్య తెలిపారు. వీరి నుంచి వివరణలు తీసుకొని, తదుపరి చర్యలకు RDOకు పంపనున్నట్లు తెలిపారు. వృద్ధులకు, వికలాంగులకు, మంచానికి పరిమితమైన రోగులకు 25-30 తేదీల్లో వారి ఇళ్ల వద్దకే రేషన్ పంపిణీ చేయాలన్నారు. అయితే కొంతమంది డీలర్లు దీన్ని దుర్వినియోగం చేశారు.