Fancy Number: ఫ్యాన్సీ నంబర్లు (Fancy Number) అంటే క్రేజ్ మాములగా ఉండదు. పారిశ్రామిక వేత్తలు, ప్రముఖులు కార్లకు ఫ్యాన్సీ నంబర్ల కోసం పోటీ పడతారు. దానిని రవాణా శాఖ (rta) క్యాష్ చేసుకుంటుంది. ఫ్యాన్సీ నంబర్లకు మాములు క్రేజ్ ఉండదు. ఎక్కువగా ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసులో ఫ్యాన్సీ నంబర్ల కేటాయింపు జరుగుతుంది. ఈ రోజు ఫ్యాన్సీ నంబర్ల ద్వారా రూ.53.34 లక్షల ఆదాయం సమకూరింది.
టీఎస్ 09 జీసీ 9999 నంబర్‌ను ఫ్రైమ్ సోర్స్ గ్లోబర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ దక్కించుకుంది. నంబర్ కోసం ఆ కంపెనీ రూ.21 లక్షల పైచిలుకు ఖర్చు చేసింది. రూ.21 లక్షల 60 వేలు పెట్టి నంబర్ కొనుగోలు చేసింది. టీఎస్ 09 జీడీ 0009 నంబర్‌కు మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్స్ కంపెనీ రూ.10.50 లక్షలు ఖర్చు చేసింది.
ఆంధ్రా ఇన్ ఫ్రా ప్రాజెక్ట్స్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, గాయజ్ జ్యువెల్లరీ ప్రైవేట్ లిమిటెడ్, సితార ఎంటర్ టైన్ మెంట్స్, సాయి పృథ్వీ ఎంటర్ ప్రైజెస్, ఫైన్ ఎక్స్ పర్ట్స్ అడ్వైజరీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీనివాస కన్ స్ట్రక్షన్స్ కూడా వేలంలో పాల్గొన్నాయి. శ్రీనివాస కంపెనీ టీఎస్ 09 జీడీ 0027 నంబర్ కోసం రూ.లక్ష 4 వేల 999 వెచ్చించింది. ఇప్పుడే కాదు చాలా సందర్భాల్లో ఫ్యాన్సీ నంబర్లకు క్రేజ్ ఉంటుంది. 9999 నంబర్ల కోసం లక్షలు లక్షలు ఖర్చుపెడతారు. దానిని ఆర్టీఏ సొమ్ము చేసుకుంటుంది.