New Couple In Tollywood: సమంత- విజయ్ దేవరకొండ (vijay) మూవీ ఖుషీ వచ్చేనెల 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ మూవీ రొమాంటిక్లా అనిపిస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలు అట్రాక్ట్ చేశాయి. హీరో హీరోయిన్లు విజయ్- సమంత (samantha) రిలేషన్ షిప్లో ఉన్నారనే వార్తలు గుప్పుమన్నాయి. దీనిపై అక్కినేని ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. ఇప్పుడు సీన్లోకి ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్ సంధు వచ్చాడు. వస్తూనే సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు.
సమంత (samantha)- విజయ్ నిజంగానే క్లోజ్ అయ్యారని ఉమైర్ సంధు అంటున్నారు. సన్నిహితుల సమాచారం మేరకు అంటూ ట్వీట్ చేశారు. ‘విజయ్-సమంత రిలేషన్ షిప్లో ఉన్నారు.. అర్ధరాత్రి వరకు ఓకే ఇంట్లో గడుపుతున్నారు. టాలీవుడ్లో కొత్త సెక్సీ జంట అని’ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. నిజమా..? అంటూ కొందరు.. అక్కినేని ఫ్యాన్స్ మాత్రం ఫేక్ అని కొట్టిపారేస్తున్నారు.
ఖుషి (kushi), సిటాడెల్ (citadel) తర్వాత ఏడాదిపాటు సమంత సినిమాలకు బ్రేకప్ చెప్పింది. బాలీ వెళ్లింది. తర్వాత అమెరికాలో మయోసైటిస్కు చికిత్స తీసుకోనుంది. సింగర్ చిన్మయ్ పిల్లలతో సమంత ఆడుకున్న వీడియో చూశాం.. కానీ సమంత- విజయ్ ఇద్దరూ రిలేషన్ షిప్లో ఉన్నారని ఊహాగానాలు రావడం.. ఉమైర్ సంధు ట్వీట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఏదైనా సరే.. నిప్పు లేనిదే పొగ రాదు కదా.. అందుకే విజయ్- సామ్ గురించి పుకార్లు షికార్లు చేస్తున్నాయి. రష్మికతో విజయ్ క్లోజ్‌గా ఉంటాడు. వారిద్దరీ మధ్య కూడా రిలేషన్ షిప్ ఉందని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇప్పుడు సమంత పేరు వినిపిస్తోంది.