IPL 2024: ఇప్పుడు వన్డే వరల్డ్ కప్‌ను క్రీడాభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు. వరల్డ్ కప్‌లో టీమిండియా జైత్ర యాత్ర కొనసాగుతోంది. దీంతో వచ్చే ప్రతీ మ్యాచ్ కోసం వెయిట్ చూస్తున్నారు. క్రికెట్ ఫ్యాన్స్‌కు మరో గుడ్ న్యూస్ చెప్పింది బీసీసీఐ. వచ్చే సీజన్ ఐపీఎల్ (IPL 2024) వేలం గురించి బీసీసీఐ చెప్పింది.
డిసెంబర్ 19వ తేదీన.. దుబాయ్ వేదికగా వేలం నిర్వహిస్తారని తెలిపింది. ఇదివరకు ఇండియాలో నిర్వహించే వారు.. ఇప్పుడు వేదికను మార్చారు. అందుకు గల కారణాన్ని కూడా వివరించారు. 10 జట్లు పాల్గొనే వేలం ప్రక్రియ నిర్వహించడం కష్టమైన పని.. ఒకచోట వందల సంఖ్యలో గదులు, సదుపాయాలు కల్పించాల్సి ఉంటుంది. బీసీసీఐ అధికారులు, ఫ్రాంచైజీల ప్రతినిధులు, బ్రాడ్ కాస్ట్ సిబ్బంది ఉంటారు. అందుకోసమే వేదికను దుబాయ్ అనుకున్నామని తెలిపారు.
అలాగు ఫ్రాంచైజీలు వెచ్చించే సొమ్ము మరింత పెరిగింది. ఇప్పటి వరకు ఒక్క ఫ్రాంచైజీకి రూ.95 కోట్ల వరకు అవకాశం ఉండే.. దానిని రూ.100 కోట్లకు చేశారు. అంటే స్టార్ క్రికెటర్ల కోసం జట్లు రూ.5 కోట్ల వరకు ఖర్చు చేసేందుకు అవకాశం ఇచ్చారు. ఇటు మహిళల ప్రీమియర్ లీగ్ 2024 గురించి కూడా వార్తలు వస్తున్నాయి. మహిళా క్రికెటర్ల కోసం డిసెంబర్ 9వ తేదీన ఉండనుందని తెలుస్తోంది. దీనిపై ఇప్పటివరకు ఐపీఎల్, బీసీసీఐ మాత్రం స్పందించలేదు.