David Warner: ఆస్ట్రేలియా డ్యాషింగ్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ (David Warner) మంచి హిట్టర్.. ఐపీఎల్లో సన్ రైజర్స్ జట్టుకు ఆడటంతో హైదరాబాద్‌తో అనుబంధం ఎక్కువే.. ముఖ్యంగా పుష్ప మూవీ వచ్చిన సమయంలో అల్లు అర్జున్ మాదిరిగా నడవడం, డ్యాన్స్ లాంటివి చేస్తుండేవారు. దీంతో అప్పట్లో వార్నర్ (Warner) ఓ సంచలనం. కానీ సన్ రైజర్స్ టీమ్ నుంచి తప్పించడం.. మరో టీమ్‌లో చేరినప్పటికీ అప్పుడప్పుడు పుష్ప స్టైల్ అనుసరించేవాడు.
డేవిడ్ వార్నర్ (David Warner) బర్త్ డే ఈ రోజు.. ఆయనకు క్రికెట్ ప్రముఖులు విష్ చేశారు. పనిలో పనిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా శుభాకాంక్షలు తెలిపారు. ఇన్ స్టా స్టోరీస్‌లో బర్త్ డే విషెస్ చెప్పారు. క్రికెట్ సూపర్ స్టార్ డేవిడ్ వార్నర్ ఇలాంటి సంతోషకర పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి.. జీవితంలో కోరుకున్నవి దక్కాలని.. మరెన్నో ఘనతలు అందుకోవాలని ఆశిస్తున్నాను అని ఇన్ స్టా స్టేటస్‌లో బన్నీ రాశారు. దానికి వార్నర్ (Warner) నుంచి రిప్లై రావాల్సి ఉంది.
పుష్ప మూవీకే కాదు బన్నీ ఇతర సినిమాలు కూడా వార్నర్ చూసేవారు. ఆ మూవీలకు సంబంధించి స్పూఫ్ వీడియోలను చేసేవారు. ఇప్పటికీ సోషల్ మీడియాలో అవి ఉన్నాయి. ఈ వరల్డ్ కప్‌లో కూడా పుష్ప లాగా తగ్గేదేలే అని గడ్డం కింద చేయితో అంటున్నారు. సెంచరీ కొడితే ఇక అంతే సంగతులు. బన్నీని వార్నర్ అభిమానిస్తున్నారు. ఫ్యాన్స్ ఏ విషయం అయినా సరే షేర్ చేసుకునే బన్ని.. వార్నర్ బర్త్ డే సందర్భంగా విష్ చేశారు.