Britain pm: బ్రిటన్ పీఎం నివాసంపై దూసుకొచ్చిన కారు
UK ప్రధాని రిషి సునాక్ అధికారిక నివాసం లండన్‌లోని డౌనింగ్ స్ట్రీట్ గేట్ వద్ద ఓ వ్యక్తి కారుతో వచ్చి ఢీకొట్టాడు. దీంతో గేట్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. అయితే ఈ ఘటనపై అధికారులు పలు రకాలుగా వివరాలను ఆరా తీస్తున్నారు.
అగ్రరాజ్యం అమెరికాలో ఇటీవల ట్రక్కు దాడి ఘటన మరచిపోకముందే..మరొక సంఘటన బ్రిటన్‌లో చోటుచేసుకుంది. సెంట్రల్ లండన్‌లోని UK ప్రధాన మంత్రి రిషి సునాక్ డౌనింగ్ స్ట్రీట్ నివాసం గేట్లపైకి ఓ కారు దూసుకెచ్చింది. అయితే వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది కారుతో ఢీకొట్టిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడనప్పటికీ ప్రమాదకరమైన డ్రైవింగ్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు ఘటన జరిగిన సమయంలో కూడా ప్రధాని రిషి సునక్ తన నివాసంలో ఉన్నారు.
ఈ ఘటనను ఉగ్రవాదానికి సంబంధించినదిగా పరిగణించడం లేదని అధికారులు తెలిపారు. ఈ ఘటన తరువాత అనేక ప్రభుత్వ విభాగాలు ఉన్న డౌనింగ్ స్ట్రీట్‌ను దాటే ప్రధాన రహదారి అయిన వైట్హాల్ ను బారికేడ్లతో రక్షణ కల్పించారు. వెలుగులోకి వచ్చిన చిత్రంలో సునాక్ 10 డౌనింగ్ స్ట్రీట్ నివాసం ఇనుప గేట్లపైకి ఒక తెల్లటి కారు దూసుకుపోయినట్లు కనిపిస్తుంది.
ఈ వారం మొదట్లో 19 ఏళ్ల భారతీయ సంతతికి చెందిన ఓ వ్యక్తి అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ నివాసం వద్ద వైట్ హౌస్ సమీపంలోని ఓ భద్రతా ట్రక్కును ఢీకొట్టిన తర్వాత అతను అరెస్టు అయ్యారు. ఆ దాడి జరిగిన తర్వాత ఇలా జరగడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా జరిగిందా లేదా కావాలనే గేటుకు ఢీకొట్టి ఏదైనా ప్లాన్ చేశారా అనే మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఇది కూడా చూడండి:Viral Video: దొంగతనం చేయడంలో కుక్కల తెలివి