»Delhi Cm Arvind Kejriwal Once Again Telangana Visit He Will Be Meets To Kcr
Telangana రేపు మరోసారి తెలంగాణకు సీఎం కేజ్రీవాల్.. ఉద్యమం కోసం కేసీఆర్ తో భేటీ?
గతంలో తెలంగాణ పర్యటనకు వచ్చిన వీరిద్దరూ మరోసారి పర్యటించనున్నారు. ప్రగతి భవన్ లో ముగ్గురు ముఖ్యమంత్రులు సమావేశం కానున్నారు. వీటితో పాటు పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం, జాతీయ రాజకీయాలు, ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు వంటి వాటిపై చర్చించే అవకాశం ఉంది.
అధికారాల (Power) విషయంలో సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశాలు ఇచ్చినా కేంద్ర ప్రభుత్వం (Govt of India) తుంగలో తొక్కుతోందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు ఒక్క ఢిల్లీ (Delhi) సమస్యగా భావించారు.. కానీ ఈ సమస్యను దేశవ్యాప్తం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వంపై పోరాడుతున్న తనకు మద్దతు పలుకాలని కోరుతూ పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కేజ్రీవాల్ కలుస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణకు (Telangana) కూడా అరవింద్ రానున్నారు. రేపు హైదరాబాద్ (Hyderabad)లో అరవింద్ కేజ్రీవాల్ పర్యటించనున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.
ఢిల్లీ అధికారాల కోసం సాగిస్తున్న పోరాటంలో (Protest) అందరినీ భాగం కావాలని కోరుతూ ఇప్పటికే మమతా బెనర్జీ (Mamata), నితీశ్ కుమార్ (Nitish), తేజస్వీ యాదవ్ (Tejaswi), ఉద్దవ్ ఠాక్రే (Uddhav), శరద్ పవార్ (Sharad Pawar) వంటి నాయకులను అరవింద్ కేజ్రీవాల్ కలిశారు. తమ పోరాటానికి మద్దతు కావాలని కోరుతున్నారు. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR)ను కూడా కలిసి మద్దతు కోరనున్నారు. ఈ మేరకు శనివారం అరవింద్ కేజ్రీవాల్ తోపాటు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ (Bhagwant Mann) కూడా హైదరాబాద్ రానున్నారు. గతంలో తెలంగాణ పర్యటనకు వచ్చిన వీరిద్దరూ మరోసారి పర్యటించనున్నారు.
ఢిల్లీ అధికారాలపై (Delhi Power) కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ (Ordinance)కు వ్యతిరేకంగా సాగిస్తున్న పోరాటానికి మద్దతునివ్వాలని సీఎం కేసీఆర్ ను అరవింద్ కేజ్రీవాల్ కోరనున్నారు. ప్రగతి భవన్ (Pragati Bhavan)లో ముగ్గురు ముఖ్యమంత్రులు సమావేశం కానున్నారు. వీటితో పాటు పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం, జాతీయ రాజకీయాలు, ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు వంటి వాటిపై చర్చించే అవకాశం ఉంది.
ఆర్డినెన్స్ పై వివాదం ఎందుకు?
కాగా, కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ ఎందుకు ఇంతలా వివాదాస్పదమైందో తెలుసుకోండి. ఢిల్లీ అధికార యంత్రాంగంపై (Delhi Officials) పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. లెఫ్టినెంట్ గవర్నర్ (Lieutenant Governor) కు నామమాత్రపు అధికారం ఉంటుందని స్పష్టం చేసింది. అయితే తీర్పు వచ్చిన రెండు రోజులకే కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. అధికారుల బదిలీ (Transfers), పోస్టింగ్ (Postings)లు కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా తన చేతుల్లోకి తీసుకుంది. అంటే లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలకు అనుగుణంగా అధికార యంత్రాంగం పని చేయాల్సి ఉంటుంది. దీంతో పాలనపరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా ఢిల్లీ అధికారులు పని చేస్తుండడంతో ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) ప్రభుత్వానికి ఆటంకాలు ఎదురవుతున్నాయి.
Meeting Hon’ble CM of Telengana tomo in Hyderabad to seek support against unconstitutional and undemocratic ordinance passed by BJP govt against the orders of Hon’ble SC.