రాజ్కోట్ వేదికగా దక్షిణాఫ్రికా-Aతో జరిగిన మూడో అనధికార వన్డేలో ఇండియా-A 73 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా-A 6 వికెట్లు కోల్పోయి 325 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో ఇండియా-A 252 పరుగులకు ఆలౌటైంది. దీంతో మూడు అనధికార వన్డే మ్యాచ్ల సిరీస్ను ఇండియా-A.. 2-1తో కైవసం చేసుకుంది.