ప్రకాశం: మార్కాపురం రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగులు హౌసింగ్ బోర్డ్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు బుధవారం స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రతి ఒక్కరికి ఐదు సెంట్ల ప్రభుత్వ భూమి కేటాయించి తమను ఆదుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పట్టణ పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు లభ్యత తక్కువగా ఉందని, పరిశీలించి న్యాయం చేస్తానన్నారు.