GNTR: జాతీయ కుష్ఠు వ్యాధి నిర్మూలనలో భాగంగా ఫిరంగిపురం మండలం మేరకపూడి గ్రామంలో బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఎన్వి. లక్ష్మి మాట్లాడుతూ.. చర్మంపై స్పర్శలేని మచ్చలు, ముక్కు దిబ్బడ, వంటి లక్షణాలు కనిపించిన వెంటనే ఇంటింటికీ సర్వేకు వచ్చే ఆరోగ్య కార్యకర్తలకు చూపించాలని గ్రామస్థులకు సూచించారు.