కోనసీమ: కేసుల సత్వర పరిష్కార మార్గమే లక్ష్యంగా ఈ నెల 14న రెండవ శనివారం అమలాపురం కోర్టు ఆవరణలో మెగా లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సీఐ సత్యనారాయణ తెలిపారు. నగదు వ్యవహారాలు, భార్యభర్తలు, రెవెన్యూ సమస్యలు, కార్మిక, చెక్‌బౌన్స్, విద్యుత్, నీటి బిల్లులు తదితర కేసులు పరిష్కరించుకోవాల్సిందిగా ఆయన సూచించారు.