NLG: చిట్యాల మున్సిపల్ పరిధిలో కోతులు, ఊర పందులు, అడవి పందులు, పిచ్చి కుక్కల బెడదతో ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ రైతు సంఘం ఆధ్వర్యంలో నాయకులు మున్సిపల్ ఛైర్ పర్సన్ పందిరి గీత, కమిషనర్ శ్రీనుకు సోమవారం వినతిపత్రం అందజేశారు. అలాగే రైతు కూలీల భవన నిర్మాణానికి స్థలాన్ని కేటాయించాలని కోరారు.