MDK: జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ఇవాళ ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. దీంతో జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను అధికారులకు వివరించారు. జిల్లా కలెక్టర్ ప్రతిమసింగ్ ఈ సందర్భంలో అందిన ఫిర్యాదులను సంబంధిత శాఖలు సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వీటిపై నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని పేర్కొన్నారు.