UP bride: ఓ వధువు తన పెళ్లి రోజున కారు బానెట్‌పై ఎక్కి ఇన్స్టాగ్రామ్ రీల్ తీయాలని అనుకుంది. పెళ్లికి వచ్చే సమయంలో బానెట్ పై ఎక్కి మండపానికి బయల్దేరింది. మధ్యలో పోలీసులు ఎంట్రీ అయ్యారు. ఇలా వెళ్లడం తప్పు అని చెప్పారు. చెప్పడమే కాక.. ఫైన్ కూడా వేశారు.
ఉత్తరప్రదేశ్‌లో కదులుతున్న కారు బానెట్‌పై వధువు ఎక్కి కూర్చుంది. అందమైన ఎరుపు రంగు లెహంగా ధరించిన వధువు సంప్రదాయంగా ఉంది. కొందరు ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటే, మరికొందరు ఇది నిర్లక్ష్య సాహసంగా అభివర్ణిస్తున్నారు. వధువు చర్యల పట్ల ఉత్తరప్రదేశ్ పోలీసులు మండిపడ్డారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు వధువుకు రూ.15,500పైగా జరిమానా విధించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో “సచ్కద్వాహై” అనే ఖాతా ద్వారా షేర్ చేయబడిన వీడియో చాలామంది దృష్టిని ఆకర్షించింది.
వీడియో కామెంట్స్ విభాగంలో నెటిజన్లు రఅభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొందరు వధువు చర్యను విమర్శించారు. ఇంకా ఎక్కువ జరిమానాలు లేదా కఠినమైన జరిమానాలు విధించాలని కోరారు. రీల్ అనేక లైక్, కామెంట్లతోపాటు వేలాది వీక్షణను పొందింది. “లడ్కీ రీల్ నహీ బనా రి థే.. లడ్కీ పార్లర్ కా ప్రమోషన్ చెల్లించింది.” సదరు వధువు రీల్ కాదు.. లేడీ పార్లర్ ప్రమోషన్ చేస్తుందని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. “ఆజ్ కల్ సింపుల్ వెడ్డింగ్ కా ట్రెండ్ హే కటం హోగ్యా హై,” అని మరొక వినియోగదారు ఎత్తి చూపారు. మరో వ్యక్తి మాత్రం “అద్భుతంగా ఉన్నారు, కీర్తి కోసం జరిమానా మరింత ఎక్కువగా కట్టాలి.” అని చమత్కరించారు.