కృష్ణా: మచిలీపట్నం కలెక్టరేట్లో కలెక్టర్ బాలాజీ, ఎస్పీ విద్యాసాగర్ నాయుడుతో కలిసి బాల బాలికలకు, యువత భద్రత గురించి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులు తప్పుదారి పట్టకుండా మంచి చెడుల వ్యవహారశైలి నివారణకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.