ప్రకాశం: ఒంగోలులోనీ కార్మిక నగరను సోమవారం సీపీఎం నేతలు సందర్శించారు. ఈ సందర్భంగా నగర కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. 186 సర్వే నెంబర్లో కార్మిక నగర్ పేరుతో నివసిస్తున్న 70 పేద కుటుంబాలను తొలగించారన్నారు. అద్దెలు చెల్లించుకొనే స్తోమత లేక తాత్కాలిక రేకులు ఇల్లు నిర్మించుకొని జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు. కొందరు ఆభూమి తమదంటూ, వారిని కాళీచేపించారు.