మంత్రి తలసాని (Minister Talasani) శ్రీనివాస్ యాదవ్పై తెలంగాణ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ యాదవ జేఏసీ (JAC) మండిపడుతోంది. ఈ విషయంలో రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఇప్పటికే రెండు సార్లు డెడ్ లైన్ విధించినా రేవంత్ రెడ్డి వెనక్కి తగ్గకపోవడంపై వారు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో గురువారం ఇందిరా పార్క్ వద్ద ఉన్న ధర్నా చౌక్ వద్ద యాదవ జేఏసీ (Yadava JAC) నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. తమ డిమాండ్ పట్ల రేవంత్ రెడ్డి స్పందించకపోవడంతో గొల్ల, కురుమలు రోడ్డెక్కారు. తలసానిపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారంటూ యాదవ జేఏసీ కొన్నిరోజులుగా నిరసన ప్రదర్శనలు చేపడుతోంది. పలు చోట్ల రేవంత్ దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు.
రేవంత్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి గాంధీ భవన్ (Gandhi Bhavan) ముట్టడికి వెళ్లాలని నిర్ణయించింది. దీంతో గాంధీ భవన్ వద్ద హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. యాదవ సంఘాల పిలుపు నేపథ్యంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా గాంధీభవన్ పరిసర ప్రాంతాల్లో ముందు జాగ్రత్తగా భారీగా పోలీసులు మోహరించారు. బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు డీసీఎంలను అందుబాటులో ఉంచారు. కాగా రేవంత్ రెడ్డి ఎక్కడ యాదవులను కించపరచలేదని మంత్రి తలసాని చేసిన వ్యాఖ్యలకు గాను ఆయనకు కౌంటర్ ఇచ్చారని కాంగ్రెస్ నేత అంజన్ కుమార్ యాదవ్ (Anjan Kumar Yadav) రీకౌంటర్ ఇస్తున్నారు.