AP: పల్నాడు జిల్లా వినుకొండలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పాల్గొని మహిళలతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం మహిళా సాధికారతకు, సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని తెలిపారు. దేశాభివృద్ధిలో మహిళల పాత్ర మరవలేనిదని, వారి అభివృద్ధికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.