SRD: జిన్నారం మున్సిపాలిటీ శివనగర్ గ్రామంలో సోమవారం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి భక్తులు ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. అనంతరం అన్నదాన కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.