PDPL: శ్రీరాంపూర్ మండలంలో జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష సోమవారం సుడిగాలి పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన నూతనంగా నిర్మించిన తహసీల్దార్ కార్యాలయాన్ని పరిశీలించారు. MPDO కార్యాలయం, షెడ్యూల్ కులాల బాలుర వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయంలో పెండింగ్ ఫైల్స్ క్లియర్ చేయాలని ఆదేశించారు. వసతి గృహంలో నాణ్యమైన భోజనం అందించాలన్నారు.