NLR: బోగోలు మండలంలోని కొండ బిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఇటీవల ముగిశాయి. ఈ నేపథ్యంలో సోమవారం స్వామివారి హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. వార్షిక బ్రహ్మోత్సవాలు 11 రోజులకు గాను రూ..23,16,043 వచ్చినట్లు ఆలయ ఛైర్మన్ శ్రీరామ్ మాల్యాద్రి, ఈవో రాధాకృష్ణ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ సిబ్బంది పాల్గొన్నారు.