W.G: భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఇవాళ నిర్వహించిన ‘పీజీఆర్ఎస్’ కార్యక్రమంలో SP అద్నాన్ నయీం అస్మీ 10 అర్జీలను స్వీకరించారు. ఇందులో ప్రధానంగా కుటుంబ కలహాలు, సైబర్ నేరాలు, భూ వివాదాలపై ఫిర్యాదులు అందాయి. అందిన అర్జీలపై త్వరితగతిన విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని అధికారులను SP ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడేది లేదని ఆయన తెలిపారు.