ప్రకాశం: మిట్టపాలెం గ్రామంలో కలిసి ఉన్న నారాయణస్వామి ఆలయానికి ఆదివారం భక్తుల ద్వారా రూ.1,40,826 ఆదాయం వచ్చినట్లు ఈవో గిరిరాజు నర్సింహబాబు సోమవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. టికెట్లు, లడ్డు ప్రసాదం విక్రయం, శాశ్వత అన్నదానం, మహాప్రాకార నిర్మాణ విరాళాలు, పంచామృత అభిషేకాలు, శ్రీపాద కానుకల ద్వారా ఈ ఆదాయం సమకూరినట్లు తెలియజేశారు.