WGL: రాయపర్తి మండలంలోని అన్ని గ్రామాల్లో పెండింగ్లో పల్లె ప్రకృతి వనాలను తక్షణమే పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఎంపీడీవో జి. కిషన్ అధికారులకు సోమవారం ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రత్యేక కార్యాచరణలో భాగంగా క్షేత్రస్థాయిలో పర్యటించిన ఆయన, రాయపర్తి గ్రామ ప్రకృతి వనాన్ని సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు.