KNR: ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకొని పేదలకు పంచుతామని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. సోమవారం తిమ్మాపూర్లో నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం, మహిళా సంఘ భవన నిర్మాణ పనులకు ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా స్థానికులు కొందరు తిమ్మాపూర్లో పలు చోట్ల ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురైనట్లుగా తెలిపారు.