బీజేపీ సీనియర్ నేత ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etala Rajender) సంచలన వ్యాఖ్యలు చేశారు. వివిధ హోదాల్లో పనిచేసిన నేత మరో కొత్త పార్టీలో చేరినపుడు కొన్ని చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయని అన్నారు. కొత్త, పాత నేతలంటూ కొంత కాలం తేడాలు కొనసాగుతాయని ఏ పార్టీలో అయినా సరే ఇది సహజమేనని ఆయన తెలిపారు.ఇతర పార్టీల నుంచి వచ్చే నాయకులకు ఉన్న అనుభవాన్ని బీజేపీ (BJP) అభివృద్ధి కోసం ఉపయోగించుకోవాలన్నదే తమ పార్టీ పెద్దల ఉద్దేశమని చెప్పారు. ఇతర పార్టీల నుంచి వచ్చి చేరే నేతలు తప్పకుండా తమ వ్యక్తిగత ఎదుగుదలను కూడా కోరుకుంటారని ఈటల రాజేందర్ చెప్పారు. మండల స్థాయిలో నేతలు పార్టీ మారినప్పుడు ఎంపీపీ (MPP) పదవిని ఆశించడం తప్పు కాదని, అలాగే నియోజకవర్గ స్థాయి నేతలు ఎమ్మెల్యే(MLA) పదవి కోరుకుంటారని చెప్పారు.
రాష్ట్రంలోనే కాదు దేశంలోని ఏ పార్టీలోనైనా ఇది సహజమేనని అన్నారు. తన రాజకీయ జీవితం(Political life)లో ఏనాడూ ఏ పదవి కావాలని నోరు విడిచి అడగలేదని ఈటల చెప్పారు. ఇప్పటి వరకు పదవులు అడగలేదని, ఇకముందు కూడా అడగబోనని చెప్పారు. తన సేవలు ఎలా ఉపయోగించుకోవాలి, ఏ బాధ్యతలు అప్పజెప్పాలి అనేది పార్టీ పెద్దలు నిర్ణయిస్తారని వివరించారు.ప్రాంతీయ పార్టీ( regional party) లకు కళ్లు, చెవులు ఉంటాయని, అదే జాతీయ పార్టీ(National Party)లకు చెవులు మాత్రమే ఉంటాయని, రాష్ట్రాలలో జరిగే విషయాలను వినడమే తప్ప చూడలేదని ఎమ్మెల్యే చెప్పారు. అందుకే, తమకు ఏదైనా అవసరం ఉన్నా ఢిల్లీకి వెళతామని, ఢిల్లీ పెద్దలకు ఏదైనా అవసరం ఉండి పిలిపించుకున్నా వెళ్లాల్సి ఉంటుందని ఈటల చెప్పారు.