WGL: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) ప్రధాన కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ గ్రీవెన్స్ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చంద్రశేఖర్ పాల్గొని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అదనపు కమిషనర్ మాట్లాడుతూ.. గ్రీవెన్స్‌లో వచ్చిన ఫిర్యాదులను సంబంధిత అధికారులు తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు.