PPM: మహిళల్లో వచ్చే భయంకరమైన గర్భాశయ క్యాన్సర్‌ను నివారించే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన హెచ్‌పీవీ టీకా పంపిణీ కార్యక్రమం మన్యం జిల్లా కేంద్రంలోని జిల్లా ఆసుపత్రిలో అధికారికంగా ప్రారంభమైంది. మహిళా ఆరోగ్య రక్షణే ధ్యేయంగా జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకరరెడ్డి ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు.14 ఏళ్లు నిండిన సుమారు 10000 మంది ఆడపిల్లలను ఈ టీకా కోసం గుర్తించామన్నారు.