నటి కరిష్మా కపూర్ మాజీ భర్త సంజయ్ ఆస్తి వ్యవహారం కేసుపై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా రెండు నెలలుగా ఫీజులు కట్టలేదని నటి కుమార్తెలు పేర్కొన్నారు. అయితే, ఫీజుకు సంబంధించిన చెల్లింపులు ఇప్పటికే చెల్లించినట్లు ప్రియా సచ్దేవ్ తరఫున న్యాయవాది తెలిపారు. ఈ కేసుపై జస్టిస్ జ్యోతిసింగ్ అసహనం వ్యక్తం చేశారు. కేసు విచారణను మెలోడ్రామాగా మార్చొద్దని హెచ్చరించారు.