దక్షిణాఫ్రికాలో 150 మందికి పైగా పాలస్తీనియన్లు ఉన్న విమానాన్ని 12 గంటలపాటు నిలిపివేశారు. ఇజ్రాయెల్ నుంచి వీరికి ఎగ్జిట్ స్టాంపులు రాలేదని వారి ప్రవేశాన్ని ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. దీంతో అక్కడి హోం మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకోవడంతో స్థానిక ప్రభుత్వేతర సంస్థ పాలస్తీనియన్లకు బస కల్పించడానికి ముందుకు వచ్చింది. దీంతో వారికి విమానం నుంచి దిగేందుకు అనుమతిచ్చారు.