ఏలూరు: జిల్లా బీజేపీ అధ్యక్షులు విక్రమ్ కిషోర్ ఆధ్వర్యంలో సోమవారం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జనతా వారధి కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కలుషిత తాగునీటి వల్ల వ్యాధుల వ్యాప్తి, రాష్ట్ర వ్యాప్తంగా ఆత్యవసర నీటి శుద్ధి కార్యక్రమం చేపట్టాలన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కి వినతిపత్రం అందచేశారు.