AP: గుంటూరు(D) మంగళగిరి(M) పెద్దవడ్లపూడిలో హైలెవల్ కెనాల్ ఎత్తిపోతల పథకాన్ని మంత్రి లోకేష్ ప్రారంభించారు. తొలుత పెదవడ్లపూడి గ్రామానికి చేరుకున్న మంత్రికి స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. అనంతరం రూ.14.88 కోట్ల వ్యయంతో నిర్మించిన హైలెవల్ కెనాల్ ఎత్తిపోతల పథకాన్ని మంత్రి ప్రారంభించారు. స్విచ్ ఆన్ చేసి పంపుల ద్వారా నీటిని విడుదల చేశారు.