VZM: విజయనగరం స్థానిక పూల్ బాగ్లో గల జిల్లా కోర్టు ప్రాంగణంలో మార్చి 14న ఉదయం 10 గంటలకు జాతీయ లోక్ అదాలత్ జరుగుతుందని సీనియర్ సివిల్ జడ్జ్ ఎ.కృష్ణప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ లోక్ అదాలత్లో వాహన ప్రమాదాలు, బ్యాంకులకు సంబంధించిన కేసులు, కాంపౌండబుల్ క్రిమినల్ వంటి తదితర కేసులు పరిష్కరించుకోవచ్చని సూచించారు.